శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయం

                   చిన్నగది అనే గ్రామంలో మొట్టమొదట 1992 ఏప్రిల్ 3న పోలమ్మగట్టు ఆలయ ప్రాంతంలో రాళ్లు పెట్టి వాటికి జీడిపళ్ళు పోసి పూజించేవారు. ఒకరోజు అప్పటి పోలమాంబ సంగం ప్రసిడెంట్ మరియు ముడసర్లోవ కార్యాచరణ సమితి ప్రెసిడెంట్ గా వున్నా శ్రీ వానపల్లి అప్పారావుగారు కలలో సరిపోలమాంబ అమ్మవారు దీపపు కాంతుల మధ్య ప్రకాశిస్తూ ఒక వెలుగు రూపంలో దర్శనమిచ్చారు.ఆ విషయాన్ని మరుసటిరోజు తెల్లవారుజామున తన సమాచార సభ్యులు,మరియు సంగం సభ్యులు ఆ మోదం తీసుకొని తక్షణమే కార్యనిర్వాణహణకై భక్తులసహకారంతో పొంద మీద రాళ్ళూ తీసుకొచ్చి రాత్రికిరాత్రే శంకుస్థాపన మరియు గర్భాలయం గొయ్యి తవ్వించారు.మరుసటి నాడు ఉదయం అనగా ఏప్రిల్ 4న గం| 10 : 25 నిమిషాలకు ముత్తయిదువులు అందరిచేత మరియు భక్తుల సంక్షేమంలో శ్రీ పోలమాంబ అమ్మవారి శంకుస్థాపన నిర్వహించడం జరిగింది. ఆ రోజు నుండి ఏప్రిల్ 14వ తారీకు వరకు ఇవాళం 10 రోజుల వ్యవధిలో గర్భాలయం నిర్మాణం చేసి అమ్మవారి విగ్రహ ప్రతిష్టను అప్పటి ( జ్.సి.సి.) డిప్యూటీ మేనేజర్ (డ్.ఎం) శ్రీ పోలబోతు తమ్మారావుగారు, తివేకి దంపతులు చేతుల మీదుగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఏప్రిల్ 15న ఉదయం గం: 9 :48 నిమిషాలకు జరిగింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకున్న ఘనత ఆ పోలమాంబ అమ్మవారిదే. అలాగే కారకచెట్టు పోలమాంబ అమ్మవారి పండగను అనుసరించి అమ్మవారి ఆజ్ఞ మేరకు అదే రోజుల్లో శ్రీ పోలమాంబ అమ్మవారి పండగ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. భక్తుల ఇచ్చినట్టువంటి పూర్వీకుల సమాచారం మేరకు అమ్మవారి పూర్వచరిత్ర 18వ శతాబ్దంలో కారకచెట్టు. పోలాంబ అమ్మవారు ఈ పోలమ్మగట్టు ప్రాంతంలో ఓ కమ్మల సడిచేసెనే తన ఆలయంలో ఏర్పాటు చేసుకొని భక్తులచే పూజలు అందుకొనే వారికీ అలాగే 2 వేపచెట్టు ఇదే గట్టుపై ఉండేవని ఆలయంలో ఒక వేపచెట్టు ఎండిపోయి ఉండగా దాన్ని బొర్రకు ఒక పశువుల కాపరి ఎండిపోయింది కదా అని అగ్గి పెట్టగా అతన్ని అమ్మవారు సర్ప రూపంలో వచ్చి కాటువేసిన వైనాన్ని పూర్వికులు, చెపుకోవడంతో అమ్మవారి ప్రాబల్యం మరింత తెలిసింది. మిగిలిన ఒక వేప చెట్టు ఈపాటికి సజీవంగా ఈనాటికి శ్రీ పోలమాంబ పుట్టబంగారాన్నీ తోలేళ్ళు రోజున తీసుకొచ్చి అమ్మవారి ఉత్సవాలు జరపటం నేటికీ ఆనవాయితీగా వస్తుంది.
                అప్పటినుంచి ప్రతి ఏడాది అమ్మవారి పండగ మహోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 1992 లో ఆరిలోవ చిన్నగదిలి ప్రాంతంలో ఎటువంటి ఆలయాలులేని నామయంలో శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకున్న గనత అమ్మవారిదే. అదే కాకుండా అమ్మవారి విగ్రహం పై ఒక సర్పం తిరుగుతూ భక్తులకు కనిపించి ఎవరిని ఏమి చేయకుండా అక్కడినుండి వెళ్లిపోయింది. అంతేకాకుండా అమ్మవారు ఒక చిన్న పాప రూపంలో 4 గంటల సమయంలో ఘల్లుఘల్లుమంటూ తిరగటం చుసిన ప్రత్యేక్ష భక్తులు కూడా ఆ ప్రాంతంలో వున్నారు. శ్రీ పోలమాంబ అమ్మవారు భక్తుల బాధలను తొలగించి వారియొక్క కోరికలను తీర్చడానికి చినగదిలి పోలమాంబ గట్టున అవతరించారు అనడంలో ఎటువంటి సందేహంలేదు. ప్రతి ఏడాది భక్తుల నామగోత్రాలతో కుంకుమ పూజలు చేసుకోవడం మరియు అమ్మవారి తన కృపాకటాక్షలను భక్తులకు ప్రసాదించడం జరుగుతుంది. అమ్మ అడుగు పెట్టిన తరువాత అల్లర్లు, కక్షకావేశాలతో వుంతువంటి ప్రాంతం ప్రశాంతత చేర్చుకునే గనత అమ్మవారిదే. ఆ పరిస్థితిని చూసి జిల్లా సర్వేసర్ పనిచేసిన శ్రీ పట్నాయక్ గారు అమ్మవారిపై ఒక శ్లోకం రాయటం జరిగింది.
                                       “భక్తి తొడను నిన్నువేద కరుణ చూపి వెలసి ఉంటివి చినగదిలి పోలమాంబగాట్టుయందు అమ్మలకే అమ్మ అందరికి అమ్మ మూలపుటమ్మ మన పోలమ్మ!”

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s